కోదాడ, ఆగస్టు 12 : కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం కోదాడ పట్టణంలోని గోల్డెన్ సిటీలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూకల మహేశ్ (35) కోదాడలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇటీవల కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతున్నాయని బంధువులు తెలిపారు. మహేశ్‌కు కొడుకు, కూతురు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.