శాలిగౌరారం, డిసెంబర్ 30 : మండలకేం ద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం. మండలంలోని రామగిరికి చెందిన బొడ్డు అర్వపల్లిని ఆయన కొడుకు కొట్టి గాయపర్చారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై అర్వపల్లి కొడుకు బొడ్డు అవిలయ్యను విచారణ నిమిత్తం పోలీసులు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా అక్కడే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు.
వెంటనే గమనించిన పోలీసులు అడ్డుకొని దవాఖానాకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. బాధితుడి కుటుంబ సభ్యులు అవిలయ్యకు చికిత్స చేయిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ విషయంపై ఎస్ఐ సతీశ్ మాట్లాడుతూ తండ్రిని కొట్టిన కేసులో అవిలయ్యను అరెస్టు చేసేందుకు వెళ్లగా కేసు నుంచి తప్పించుకునేందుకే పురుగుల మందు తాగాడని తెలిపారు. అతడి నుంచి వాసన వస్తుండడంతో గమనించి వెంటనే దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.