తుంగతుర్తి, మార్చి 21 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పేర్ల నాగయ్య పిలుపునిచ్చారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నేడు భారతదేశంలోని వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దూరదృష్టి లేని బిజెపి ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు.