వేములపల్లి, జూన్ 26 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా నాయకుడు రొండి శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలతో కలిసి వైద్యురాలికి సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెలో ఆశా వర్కర్లందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశాలు బొంగర్ల సుజాత, కేసాని జయమ్మ, మంగమ్మ, రాధిక పాల్గొన్నారు.