నల్లగొండ : జిల్లాలోని కట్టంగూర్ మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మండలంలోని మునుకుంట్లలో నివాసముంటున్న సూర్యాపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న ప్రసన్న ( Prasanna ) కు చరణ్ ( Charan ) అనే యువకుడితో పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రేమించుకుంటు న్నారు.
అయితే ప్రసన్న ఉరేసుకుని బలవన్మరణానికి ( Suicide ) పాల్పడింది. చరణ్ కారణంగా తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ప్రసన్న కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆ అవమానాన్ని భరించలేక చరణ్ తాటి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వీరి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.