Dhaka Protests: 81 అడుగుల రాముడి విగ్రహ నిర్మాణం.. హిందూ వ్యక్తి అరెస్టుతో ఢాకాలో మైనార్టీల నిరసన
Dhaka Protests: ఢాకాలో ఇవాళ హిందూ మైనార్టీలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. హరిదాస్ చంద్ర తరణి దాస్‌ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మనీల్యాండరింగ్ కేసులో ఆయన్ను అదపులోకి తీసుకున్నారు. గైబందా జిల్లాలో 81 అడుగుల రాముడి విగ్రహాన్ని తరణి దాస్ నిర్మిస్తున్నట్లు తెలిసింది.
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇవాళ హిందూ మైనార్టీలు భారీ నిరసన(Dhaka Protests) ప్రదర్శన చేపట్టారు. హరిదాస్ చంద్ర తరణి దాస్‌ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్ వద్ద ఇవాళ ఈ ఆందోళన జరిగింది. గైబందా జిల్లాలో 81 అడుగుల రాముడి విగ్రహాన్ని నిర్మించేందుకు హరిదాస్ చంద్ర పూనుకున్నారు. అయితే ఆయనపై బంగ్లా సర్కారు మనీ ల్యాండరింగ్ అభియోగాలు నమోదు చేసి అరెస్టు చేసింది. రాముడి విగ్రహ నిర్మాణాన్ని ఆపేందుకే బంగ్లాదేశ్ సర్కారు హరిదాస్‌ను అరెస్టు చేసినట్లు హిందూ-బౌద్ధ-క్రైస్తవ ఐక్యతా సంఘం ఆరోపించింది. మైనార్టీలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, దాస్‌ను తక్షణమే రిలీజ్ చేయాలని మైనార్టీలు డిమాండ్ చేశారు.
పలాస్బారిలో రామచంద్రుడి విగ్రహన్ని దాస్ నిర్మిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ అక్రమ రీతిలో తరణిదాస్ను అరెస్టు చేసినట్లు మనీంద్ర కుమార్ నాథ్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో గత రెండేళ్ల నుంచి మూడు వేల దాడి ఘటనలు జరిగాయని, దీంట్లో 66 మంది మర్డర్ అయ్యారని, అనేక ఆలయాలను ధ్వంసం చేశారని తెలిపారు. సుమారు 10 కోట్ల మేరకు అక్రమలావాదేవీలు నిర్వహించినట్లు హరిదాస్‌పై కేసు ఉన్నది. 2010లో ఆయన ఇండియాకు వెళ్లారని, 2019లో ముస్లింగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.
News coming in from #Dhaka of #Bangladesh.
A protest rally is going on in #Dhaka against the arrest of Haridas Chandra Tarani Das.
Haridas Chandra Tarani Das wanted to build a Murti of Prabhu Sri Ram in Palashbari of Gaibandha district.
But, the Islamists objected. Later,… pic.twitter.com/UYczqpeSKf
— Hindu Voice (@HinduVoice_in) July 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

