యాదగిరిగుట్ట.. భక్తజనసంద్రం
పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే కనిపించారు. వరుస సెలవుల నేపథ్యంలో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
- దర్శనాలకు బారులు తీరిన భక్తజనం
- శ్రీవారి ఖజానాకు రూ. 63,83,777 ఆదాయం
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 9 : పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే కనిపించారు. వరుస సెలవుల నేపథ్యంలో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మాఢ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. కొండపైకి వాహనాల రద్దీ కొనసాగింది. స్వామి ధర్మ దర్శనానికి 5 గంటలు, వీఐపీ దర్శనానికి 4 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా నిత్యారాధనలు
తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 48 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.63,83,777 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామిని దర్శించుకున్న ప్రముఖులు
శ్రీవారిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సెక్రటరీ మహాబీర్ సింగ్ కుటుంబసభ్యులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికి దర్శన అనంతరం వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు. వీరితో పాటు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాస్‌రావు, 100మంది పీఆర్టీయూ టీఎస్ కార్యవర్గ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

