‘కక్షిదారుల సత్వర న్యాయానికి లోక్ అదాలత్ దోహదం’
కక్షిదారుల సత్వర న్యాయానికి లోక్ అదాలత్‌లు దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం..
– నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు
– పెండింగ్, ప్రీ లిటిగేషన్ కేసులు 13,338 పరిష్కారం
రామగిరి, మార్చి 28 : కక్షిదారుల సత్వర న్యాయానికి లోక్ అదాలత్‌లు దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థలో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. లోక్ అదాలత్‌లో తీర్పు వస్తే తిరిగి అప్పీలుకు అవకాశం ఉండదన్నారు. నల్లగొండతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టులో వివిధ కోర్టులలో 16 బెంచీలలో సివిల్ కేసలు 20, క్రిమినల్ కేసులు 5,535, మోటర్ వాహన ప్రమాద బీమా కేసులు 156, ఇతర ప్రీ లిటిగేషన్ కేసులు 8,125, సైబర్ క్రైమ్ కేసలు 37 మొత్తం పెండింగ్, ప్రీ లిటిగేషన్ కేసులు 13,338 పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా ప్రమాద బీమా కేసుల్లో రూ.81,31, 0945 నష్ట పరిహారం బాదితులకు ఇప్పించినట్లు తెలిపారు. నల్లగొండలో నిర్వహించిన లోక్ అదాలల్లో ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.పురుషోత్తంరావు, వివిధ కోర్టుల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, కార్యదర్శి మంద నగేశ్, న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

