మునుగోడు, మార్చి 25 : లయన్స్ క్లబ్ గోల్డ్ సేవలు అభినందనీయమని మునుగోడు ఎంఈఓ టి.మల్లేశం అన్నారు. లయన్స్ క్లబ్ గోల్డ్, నల్లగొండ వారు మంగళవారం యూపీఎస్ పులిపలుపుల పాఠశాలకు రూ.25 వేల విలువ చేసే డెస్క్ బెంచీలు, జడ్పీహెచ్ఎస్ కోరటికల్కు స్పోర్ట్స్ మెటీరియల్, పరీక్ష ప్యాడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు లైన్స్ క్లబ్ గోల్డ్ వారు అవసరమైన వసతులు కల్పించడం అభినందనీయం అన్నారు.
మునుగోడు మండలంలోని మరికొన్ని పాఠశాలలను ఎంచుకుని సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు సుంకరి భిక్షంగౌడ్, లైన్స్ క్లబ్ గోల్డ్ రీజినల్ మేనేజర్ ప్రదీప్, అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, విజయ్, రవి, ఉమ, నాగరాజు, మదనాచారి, లైన్ వెంకటేశ్వర్లు, పులిపల్పుల పాఠశాల హెచ్ఎం డి.కళావతి, మునుగోడు మండల పీఆర్టీయూ అధ్యక్షుడు యూసుఫ్ పాషా, వెంకటయ్య, రవీందర్, నాగరాజు, స్వామి, మేరీ, అంజిరెడ్డి, గోవర్ధన్ పాల్గొన్నారు.