చిట్యాల, జూలై 22 : ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి అండగా ఉందామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం ఆయన చిట్యాలలో కొత్త రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిది చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. చిట్యాల మండలంలో 1,600 రేషన్ కార్డులు , 500 పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రజల కోసం జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మిస్తున్నామని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి పల్లె కాల్వలను పూర్తి చేస్తున్నట్లు చెపపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి, తాసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ ఎస్ పి జయలక్ష్మి, మార్కెట్ చైర్మన్ నర్రా వినోదమోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్‌రెడ్డి, నాయకులు పోకల దేవదాసు, గుడిపాటి లక్ష్మీనరసింహ, జడల చిన్న మల్లయ్య, ఎద్దులపురి కృష్ణ, మారగోని ఆంజనేయులు, బట్టు ఐలేశ్, ఏనుగు రఘుమారెడ్డి, జనగాం రవీందర్, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.