– బీసీపీ నల్లగొండ జిల్లా నాయకుడు కొండ లింగయ్య యాదవ్
నకిరేకల్, మే 13 : కామ్రేడ్ మారోజు వీరన్నతో పాటు కుల వర్గ నిర్మూలన పోరుబాటలో అమరులైన 135 మంది కామ్రేడ్స్ వర్ధంతి సభలను అమరుల వారోత్సవ సభలుగా జరుపుకుందాం అనే కరపత్రాన్ని నకిరేకల్ లోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బహుజన కమ్యూనిస్టు పార్టీ(బిసిపి) నల్లగొండ జిల్లా నాయకుడు కొండ లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. భారత విప్లవోద్యమ రథసారథి, మలిదశ తెలంగాణ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ మారోజు ఒకవైపు కుల నిర్మూలన కోసం, కుల అస్తిత్వ ఉద్యమాలను వర్గ నిర్మూలన కోసం వర్గ సంఘాలను ఈ రెండు ఉద్యమాలను ఏకతాటిపై తీసుకువచ్చిన వచ్చని వ్యక్తి అన్నారు. ఈ దేశంలో మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు ఏకతాటిపైకి వచ్చి కుల నిర్మూలన చైతన్యంతో ప్రజా ఉద్యమాలను ఒకే ప్రజా ఉద్యమంగా రాజ్యాధికారం దిశగా పోరాడాలని అప్పుడే భారత్లో సామాజిక న్యాయం, రాజ్యాధికారం, విప్లవం విజయవంతం అవుతుందని లింగయ్య యాదవ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బహుజన మహాసభ (BMS) నల్లగొండ జిల్లా కన్వీనర్ చెట్టుపల్లి కాశిరామ్ మాదిగ, బహుజన కూలి రైతు సంఘం (BCRS) జిల్లా నాయకుడు గుత్తా వెంకట్ రెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి పుట్ట సత్తయ్య, మూసి మాజీ చైర్మన్ సాధుల నర్సయ్య, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గం సైదులు, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు అక్కినపల్లి వీరస్వామి, మానవ హక్కుల వేదిక జిల్లా కమిటీ సభ్యుడు గడ్డం వెంకటరమణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరూరి వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు మామిడి ఎల్లయ్య, దళిత మహాజన జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు, దళిత రత్న కొత్తపల్లి ప్రభాకర్ పాస్టర్, కరుణాకర్ పాల్గొన్నారు.