కోదాడ, ఆగస్టు 11 : విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని కోదాడ షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ ఎం.కవిత అన్నారు. సోమవారం కోదాడ కె ఆర్ ఆర్ జూనియర్ కళాశాలలో సూర్యాపేట జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు నిర్వహించిన చైతన్య సదస్సులో ఆమె మాట్లాడారు. ఈవ్ టీజింగ్ లకు పాల్పడే ఆకతాయిల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అయినప్పటికీ నేరం చేసి పట్టుబడితే నిర్భయ కేసులు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు సామాజిక రుగ్మతలకు, పోకిరి చేష్టలకు దూరంగా ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఆర్.పిచ్చిరెడ్డి, షీ టీమ్ బృందం కానిస్టేబుల్ కె.సాయి జ్యోతి, కానిస్టేబుల్ జి.నాగేంద్రబాబు, అధ్యాపకులు జి.యాదగిరి, వి.బల భీమారావు, ఆర్.రమేశ్, పి.రాజేశ్, ఎం.రత్నకుమారి, బి.రమేశ్ బాబు, జి.వెంకన్న, కె.రామరాజు, జి.రవి కిరణ్, జి.నాగరాజు, ఎస్.గోపికృష్ణ, ఎస్కే.ముస్తఫా, ఈ.నరసింహారెడ్డి, ఎస్కే.ఆరిఫ్, ఎన్.జ్యోతిలక్ష్మి, ఆర్.చంద్రశేఖర్, ఎస్.వెంకటేశ్వరాచారి, టి.మమత, డీ.ఎస్.రావు పాల్గొన్నారు.