బీబీనగర్, మే 4 : ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, పరిపాలనలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బీబీనగర్ పట్టణ కేంద్రంతోపాటు, మండలంలోని లక్ష్మీదేవిగూడేనికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ప్రజలు అడుగక ముందే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, కొత్త పథకాలు కాదు కదా ఉన్న పథకాలు కూడా అమలు చేసే పరిస్థితి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు, ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన బీజేవైఎం జిల్లా నాయకుడు దేవరుప్పల పృథ్వీరాజ్, పెంచికల సత్యశివసాయిప్రసాద్, గోరుకంటి శివకుమార్, ఆకుల సాయికుమార్, కాశబోయిన శ్రీనివాస్, ఉప్పలంచి నరేందర్, ఎండీ ఫసియొద్దీన్, రాగిరు భరత్ గౌడ్, ఉప్పలంచి రాజు, పారెల్లి నరేశ్, ఉడుత దయాకర్, కుకునూరు సాయిచారి, రాజ్‌కుమార్, నరేశ్, శ్రీధర్, ప్రేమ్‌రాజ్, పవన్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్, నాయకులు బొక జైపాల్ రెడ్డి, గాదె కవితానరేందర్ రెడ్డి, చెంగలి వెంకటకిషన్ రావు, పిట్టల అశోక్, మల్లగారి శ్రీనివాస్, మంచాల రవికుమార్, గోరుకంటి బాలచందర్, కొంతం లింగయ్యగౌడ్, సుదర్శన్ రెడ్డి, పంజాల సతీశ్‌గౌడ్, కొలను దేవేందర్ రెడ్డి, గోలి సంతోషరెడ్డి, జకి నగేశ్, కొంతం భాసర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.