బీఆర్ఎస్లో చేరికల జోరు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న కారు పార్టీకి జై కొడుతూ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొంటున్నారు. శనివారం సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్ సమక్షంలో చేరికలు జరిగాయి.
- హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
- కాంగ్రెస్ నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరిక
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న కారు పార్టీకి జై కొడుతూ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొంటున్నారు. శనివారం సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్ సమక్షంలో చేరికలు జరిగాయి.
హుజూర్నగర్, సెప్టెంబర్ 30 : దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి సకల జనులు బీఆర్ఎస్లో చేరుతున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణంలోని 13వ వార్డు అంబేద్కర్ కాలనీ కి చెందిన 100 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా మార్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతులకు 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాల ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. విపక్షాలు ఎన్ని అవరోధాలు సృష్టించినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్దే అధికారం అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్రెడ్డి, వార్డు ఇన్చార్జి భూక్యా చంద్రమౌళి, అంబేద్కర్ కాలనీ వార్డు అధ్యక్షుడు మీసాల కిరణ్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?