నీలగిరి, జూన్ 19 : నల్లగొండ జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కార్యాలయంలోని సర్వే, భూ రికార్డుల డిప్యూటీ ఇన్స్పెక్టర్ (డీఐ) పవన్‌కుమార్ శుక్రవా రం ఏసీబీ వలలో చికుకున్నారు. దీంతో ఆర్డీవో కార్యాలయంలో, ఆయన ఇంట్లో రెండు ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఏసీబీ డీఎస్పీ జగదీశ్చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలంలో ఫిర్యాది తల్లి, అత్తకు చెందిన భూములను సర్వే చేసేందుకు రూ.35వేలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. భూమి సర్వే చేసిన రోజున ఫిర్యాదుదారుడి వద్ద రూ. 20వేలు బలవంతంగా తీసుకున్నట్లు తెలిపారు. వాటికి సంబంధించిన రిపోర్టు ఇచ్చేందుకు మరో రూ.15వేలు ఇవ్వాలని లేకుంటే రిపోర్టు ఇవ్వనని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమీపంలోని ఓ టీ స్టాల్‌కు రమ్మని చెప్పగా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏసీబీ అధికారులు రూ.15వేలు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు.
అతడిని అదుపులోకి తీసుకొని శనివారం నాంపల్లి కోర్టులో హజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేసిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడం కోసం ప్రజలు ఏసీబీ (ACB) టోల్ ఫ్రీ నంబర్ అయిన 1064ను సంప్రదించవలసిందిగా కోరారు. ఏసీబీ తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లైన వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (తెలంగాణ ఏసీబీ), మాజీ/పూర్వపు ట్విట్టర్ (@తెలంగాణ ఏసీబీ) ద్వారా కూడా సంప్రదించవచ్చన్నారు.