అర్వపల్లి, జనవరి 31 : భూ సరిహద్దుల జియో ట్యాగింగ్ వల్ల వివాదాలు తగ్గి, ప్రజలకు భూమిపై పూర్తి హక్కు రికార్డు ఇవ్వడమే భూ భారతి రీ సర్వే ఉద్దేశమని ఆర్డీఓ వేణు మాధవరావు అన్నారు. భూ భారతి భూముల రీ సర్వేపై పైలెట్ గ్రామంగా జాజిరెడ్డిగూడెం ఎంపిక చేయగా శనివారం అర్వపల్లిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గ్రామ ప్రజలు, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీకాంత్, సర్వే, ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఐఓ ప్రకాష్, ఎంపీడీఓ ఝాన్సీ, మండల సర్వేయర్ వెంకటేష్, ఆర్ఐలు వెంకట్ రెడ్డి, జలంధర్ రావు, ప్రసన్న, సర్పంచులు చిల్లంచర్ల విద్యాసాగర్, కృష్ణమూర్తి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.