కట్టంగూర్, మే 20 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పెంజర్ల సైదులు అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను ఏర్పాటు చేసి కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
జులై 9న చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కట్టంగూరు మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములు నిరసన కార్యక్రమంలో పాల్గొని సీఐటీయూ నాయకులకు సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పొడిచేటి సులోచన, పొడిచేటి లింగయ్య, కత్తుల శంకర్, పల్స యాదయ్య, తవిటి వెంకటమ్మ, చౌగోని ధనలక్ష్మి, భూపతి రేణుక, చెరుకు జానకి, నాగయ్య, సదీప్ పాల్గొన్నారు.