– ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీరిది
– మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చండూరు, ఫిబ్రవరి 06 : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొద్దుగాల ముఖ్యమంత్రిని తిట్టడం రాత్రి పోయి కాళ్లు మొక్కడం అలవాటైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చండూరు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కూసుకుంట్ల ప్రచారం నిర్వహించారు. 4వ వార్డు ఇరిగి వెంకటమ్మ రామన్న, 5వ వార్డు గుండ్రెడ్డి మధుతో కలిసి మల్లన్న గుడి దగ్గర నుండి లేపాక్షి కాలనీ, రాజీవ్ కాలనీ, అంగడిపేట ఎల్లమ్మ గుడి దగ్గర వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 3వ వార్డు సామ సుజాత యాదవ రెడ్డి, 9వ వార్డు గుంటి పద్మ వెంకటేశంతో కలిసి ఎన్టీఆర్ కాలనీ మీదుగా వినాయక మండపం, తాసీల్దార్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. 10వ వార్డు అభ్యర్థి సతీష్ తో కలిసి కోట మైసమ్మ దేవాలయం నుండి గల్లీలో గడపగడపకు తిరుగుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గ సాగునీరు, త్రాగునీరు మీద కనీసం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి గల్లీలో గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన సిసి రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి పైప్ లైన్లు తప్ప ఏ ఒక్క పని చేసిండో మల్లన్న దేవుడి సాక్షిగా ప్రమాణాలు చేసి చెప్పాలని సవాల్ విసిరారు. ఓటర్లకు ఎవరు ఎక్కువ డబ్బులు పంచుతారో వారిని వెతికి కౌన్సిలర్‌గా పోటీకి నిలబెట్టాడన్నారు. మన మధ్యనే ఉండి ప్రతి సమస్యకు స్పందించి ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని గెలిపించుకోవాలని ఆయన మనవి చేశారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపులు బంధు చేపిస్తామని చెప్పి మాట తప్పడాన్నారు. ఆయన అనుచరులకు మందు ఉద్దర ఇవ్వలేదని మద్యం షాపులపై దాడులు, చండూరులో అరాచకాలు, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయన్నారు.

‘పొద్దుగాల తిట్టుడు.. రాత్రిపోయి కాళ్లు మొక్కుడు’
తాను గత ప్రభుత్వంలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేస్తే, ఇప్పుడు వచ్చి నేనే లైట్లు వేశా, నేనే రోడ్లు వేశా అని గొప్పలు చెప్పుకుంటూ కొబ్బరికాయ కొట్టుకుంటూ శిలాఫలకాలు వేస్తున్నాడే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయని విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అమృత్ పథకం కింద తాను మంజూరు చేయించిన రూ.12 కోట్లల్లో ఇంకా రూ.6 కోట్ల నిధులు మున్సిపాలిటీలో మరుగుతున్నట్లు తెలిపారు. ఆ నిధులు విడుదల చేయించి మున్సిపాలిటీ అభివృద్ధి చేసే దమ్ము ధైర్యం లేదన్నారు. మున్సిపాలిటీలో మిగిలిపోయిన అన్ని పనులను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కోడి బ్రదర్స్ కు మున్సిపాలిటీ అప్పజెప్పడం కోసం ఆరాట పడుతున్నారని, కోడి బ్రదర్స్ కు పాఠశాలల మీద ఉన్న ప్రేమ మున్సిపల్ అభివృద్ధిపై ఉండదన్నారు. వాళ్ల పాఠశాలల వల్ల ఇక్కడికి మోడల్ స్కూల్ గాని, ఇంటిగ్రేటెడ్ పాఠశాల తేవడం లేదన్నారు. కావున బీఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, ఇరిగి రామకృష్ణ, నకిరికంటి రామలింగం, చొప్పరి దశరథ, బూతురాజు వెంకన్న, బొమ్మరబోయిన వెంకన్న, మాజీ అధ్యక్షుడు పెదగొని వెంకన్న గౌడ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు సంగేపు సువర్ణ, మండల మహిళా అధ్యక్షురాలు పెండ్యాల గీత, గోపిడి వెంకట్ రెడ్డి, నందికొండ నరసింహారెడ్డి, నరపాక శంకర్, చిలువేరు నరేష్, పనస లింగస్వామి, కళ్లెం సైదులు రెడ్డి, ప్రసాదు, దాసరి స్వామి, కళ్లెం మహేందర్ రెడ్డి, చొప్పరి కళ్యాణ్, పాశం శేఖర్ రెడ్డి, కాసాని శ్రీధర్ రెడ్డి, రామకృష్ణ, కారింగు సాయి పాల్గొన్నారు.