రామన్నపేట, అక్టోబర్ 17 : గో సేవా విభాగం ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలో నిర్వహించిన జిల్లా స్థాయి గో విజ్ఞాన పరీక్షలు- 2025 లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. వి.శరణ్ తేజ్ (8వ తరగతి) జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి, ఎస్.సింధు (9వ తరగతి) తృతీయ బహుమతి, కె.గీతాంజలి, బి. ప్రణీత్ రెడ్డి కన్సోలేషన్ బహుమతులు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు డీఈఓ సత్యనారాయణ బహుమతులు అందజేశారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ బి.యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె.మణి, ఉపాధ్యాయ బృందం అభినందించింది.