నాంపల్లి, మే 13 : రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు రైసు మిల్లర్లతో కుమ్మకై కమీషన్ల కోసం రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు రైసు మిల్లర్లతో కుమ్మకై రైతులకు లారీలు సైప్లె చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడన్నారు. కల్లాల వద్దకు వస్తే రైతుల కష్టాలు తెలుస్తాయన్నారు.
స్థానిక తాసీల్దార్తో ఫోన్లో మాట్లాడి తక్షణమే రైతులకు తగిన సంఖ్యలో లారీలు కేటాయించాలని లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు, అధికార ప్రతినిధి పోగుల వెంకట్ రెడ్డి, వూదరి సైదులు, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఇట్రెం వెంకట్ రెడ్డి, బొల్లంపల్లి వెంకటేశ్వర్లు, సర్పంచులు నక్క చంద్రశేఖర్, కడారి శ్రీశైలం యాదవ్, సాగర్ల యాదయ్య, పల్లె వెంకటయ్య, నడింపల్లి యాదయ్య, దామోర సహాదేవ్, సభావత్ సర్దార్ నాయక్, బాష్పాక రాములు, బెల్లి సత్తయ్య, మేకల దేవేందర్, కంశెట్టి పాండు, గౌరు కిరణ్, కాటబోయిన శంకర్, వట్టికోటి నరేశ్ పాల్గొన్నారు.