కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 25 : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రానికి చెందిన ఎల్లబోయిన రవి, శోభా దంపతుల కుమార్తె రుచిత టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది. సివిల్స్ లక్ష్యంగా కోచింగ్ తీసుకున్న ఆమె టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రాసి 502.5 మార్కులు సాధించి డీఎస్పీ ఉద్యోగం సాధించింది. డీఎస్పీ ఉద్యోగం సాధించడంపై రుచితకు కుటుంబ సభ్యులు, బంధువులు, పట్టణవాసులు శుభాకాంక్షలు తెలిపారు.