ఆరు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హుజూర్‌నగర్‌కు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడకు పద్మావతి, నకిరేకల్‌కు వేముల వీరేశం, నాగార్జునసాగర్‌కు కుందూరు,
- మిగతా స్థానాలపై కుదరని సయోధ్య
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్15(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హుజూర్‌నగర్‌కు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడకు పద్మావతి, నకిరేకల్‌కు వేముల వీరేశం, నాగార్జునసాగర్‌కు కుందూరు.
(మొదటి పేజీ తరువాయి) జయవీర్‌రెడ్డి, ఆలేరుకు బీర్ల ఐలయ్యలను ఖరారు చేస్తూ తొలి జాబితా విడుదల చేసింది. మిగతా ఆరు స్థానాల్లో అభ్యర్థులపై ఇంకా సయోధ్య కుదరనట్లు తెలిసింది. సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి మధ్య టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ కాదంటే ఎవరేనేది స్పష్టత లేదు. భువనగిరిలో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి దాదాపు ఖరారే అని చర్చ నడుస్తున్నా… స్థానికంగా ఉన్న బీసీ నేత రామంజనేయగౌడ్ బీసీ కోటాలో పట్టుబడుతున్నారు.
మునుగోడును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయిస్తారని ఆది నుంచి చర్చ ఉన్నా..తాజాగా లేదని తెలుస్తున్నది. దాంతో అక్కడ చెలమళ్ల కృష్ణారెడ్డికి టికెట్ రావచ్చని భావన. మిర్యాలగూడ టికెట్‌ను పొత్తులో భాగంగా సీపీఎంకి కేటాయిస్తారన్న చర్చ ఉంది. ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్, వడ్త్యా రమేశ్‌నాయక్, కిషన్నాయక్ల మధ్య టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే ప్రకటించిన నకిరేకల్‌లో ఇన్నాళ్లు టికెట్టు ఆశించిన దైద రవీందర్, వేదాసు శ్రీధర్, కొండేటి మల్లయ్య లాంటి వాళ్లు ఏ మాత్రం సహకారం అందిస్తారనేది చూడాల్సిందే. ఇక ఆలేరులో బోరెడ్డి అయోధ్యరెడ్డి, కట్కూరి రాంచంద్రారెడ్డి లాంటి నేతలు కూడా బీర్ల ఐలయ్య అభ్యర్థిత్వానికి ఏ మేరకు సపోర్టు చేస్తారనేది సందేహాస్పదంగానే ఉంది. నల్లగొండలోనూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి బీసీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేక కనిపిస్తున్నది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

