కోదాడ, ఏప్రిల్ 19 : దేశవ్యాప్తంగా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరి సెషన్ -2 ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్టు కోదాడ రేస్ ఐఐటి అకాడమీ చైర్మన్ బాణాల వసంత వెంకట్రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఎస్.డి హుజైఫా ఆల్ ఇండియా స్థాయిలో 3,469 వ ర్యాంక్, టి రోహిత్ రెడ్డి 4,160, ఎస్ దీక్షిత 4,635, పి సూర్యప్రకాశ్ 6,253, సిహెచ్ కుషాల్ సాయి స్వరూప్ రెడ్డి 8,241 ర్యాంక్ సాధించినట్లు ఆమె చెప్పారు. అత్యధిక పర్సంటైల్ తో పాటు ర్యాంకులు సాధించిన విద్యార్థులను శనివారం కళాశాలలో అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.