– అధ్యక్షుcrగా కత్రం సీతారామరెడ్డి, కార్యదర్శిగా రంగారావు
కోదాడ, మార్చి 28 : కోదాడ పబ్లిక్ క్లబ్ పాలకవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిటీ బాధ్యులు ప్రముఖ న్యాయవాది ఎస్ ఆర్ కె మూర్తి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడిగా సీతారామరెడ్డి, కార్యదర్శిగా పోటు రంగారావుతో పాటు ఇతర పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా తోట రంగారావు, గుండపనేని వెంకట సత్యనారాయణ రావు, సంయుక్త కార్యదర్శిగా వంగవీటి గురునాథం, కోటమర్తి విద్యాసాగర్ రావుతో పాటు కార్యవర్గ సభ్యులుగా టి.రామయ్య, శేషగిరిరావు, సుంకర సత్యనారాయణ, ముండ్రా రవికుమార్, ఇర్ల నాగ మునీర్ రెడ్డి, కుక్కడపు వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పాలకవర్గానికి మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.