కోదాడ, ఏప్రిల్ 30 : కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. పాఠశాలకు చెందిన 99 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 89 మంది ఉత్తీర్ణులయ్యారు. తాళ్లూరి రేఖశ్రీ 571 మార్కులతో జిల్లాలోనే టాపర్గా నిలిచింది. అదేవిధంగా పాఠశాలకు చెందిన కంపెల్లి నరేందర్ -549, ఆసిఫా -526, భరత్నాయక్ -510, ప్రభు చరణ్ వైష్ణవి -506 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ సలీమ్ షరీఫ్, ఉపాధ్యాయులు మార్కండేయ, దేవరాజు శ్రీనివాసరెడ్డి, బడుగుల సైదులు, జానకిరామ్, బ్రహ్మానందం, సురేశ్ అభినందించారు.
Kodada : పది ఫలితాల్లో కోదాడ జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల ప్రతిభ