కోదాడ, నవంబర్ 24 : రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కోదాడకు చెందిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటారు. మూడు రోజుల పాటు వరంగల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సూర్యాపేట జిల్లా నుండి ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు గర్ల్స్ యూత్, జూనియర్, సీనియర్ విభాగాల్లో 10 మంది పాల్గొన్నారు. అందులో 63 కేజీల విభాగంలో పవిత్ర గోల్డ్ మెడల్, 69 కేజీల విభాగంలో వి.గౌరీ గోల్డ్ మెడల్ తో పాటు మిగతా వారు ఓవరాల్ గా 18 మంది గోల్డ్, సిల్వర్, కాంస్య పథకాలను సాధించారు.
పథకాలు సాధించిన క్రీడాకారులను స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు అసోసియేషన్ నాయకులు అభినందించి ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన కోచ్ పాలడుగు ఖ్యాతి, మనోజ్ కుమార్, ప్రపుల్ కుమార్ ను అభినందించారు. ఈ నెల 24 నుంచి 30 వరకు రాజస్థాన్ లోని బికనీర్లో జరిగే ఖేలో ఇండియా యూనివర్సిటీ 2025 క్రీడలకు, అలాగే డిసెంబర్ 1 నుండి 5 వరకు కేరళ త్రిశూల్ లో జరిగే అశ్విత ఖేలో ఇండియా సౌత్ జోన్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి టెక్నికల్ అఫీషియల్ గా కోచ్ పాలడుగు ఖ్యాతి నియమితులయ్యారు.