నల్లగొండ మున్సిపాలిటీలో ఏడాదిన్నర కాలంగా అనధికార పనులకు తెరతీసిన అధికారులు నయా దందాకు శ్రీకారం చుట్టారు. రెగ్యులర్ ఉద్యోగులున్నా వారిని కీలక పనుల నుంచి తప్పించి.. వారు నియమించుకున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో ఈ అక్రమ ప్రక్రియను కొనసాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆస్తిపన్ను రివిజన్తో పాటు ఇంజినీరింగ్ పనుల్లో నాణ్యతా లోపం, వెంచర నిర్మాణంలో లోపించిన నిబంధనలు, ఉద్యోగుల నియామకాలతో డబ్బులు వసూలు ఇలా ఒక్కటేంటి… ప్రతి విభాగంలో దొరికితే చాలు బరికేద్దామంటూ పిండేస్తున్నారట. ఈ విషయాన్ని మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు కొండూరు సత్యనారాయణ పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవటంతో శుక్రవారం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు.
నల్లగొండ, జులై 25 : నల్లగొండ మున్సిపాలిటీకి వచ్చే ఆ దాయాన్ని పలు లొసుగులతో గండి కొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో బుక్స్మార్చి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన మున్సిపల్ యంత్రాంగం తాజాగా రివిజన్ పేరుతో నయా దందాకు తెర తీశారనే ఆరోపణలు వస్తున్నాయి. దేవరకొండ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌తో పాటు సాగర్ రోడ్డులోని ఓ రైస్‌మిల్‌కు లక్షల్లో ఆస్తిపన్ను రావడంతో ఆయా భవనాలకు మరోసారి అసెస్మెంట్ చేశారు. ఆస్తిపన్ను తగ్గించి పెద్ద ఎత్తున కమీషన్ వసూలు చేసి జేబులు నింపేసుకున్నారట. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి దావానంలా వ్యాపించటంతో బడాబాబులు వారిని ఆశ్రయించి అంతో.. ఇంతో సమర్పించుకొని ఈ ఏడాది కాలంలోనే సుమారు రూ.6 కోట్లు వెనకేసుకున్నారట. పట్టణం నలుమూలలా విచ్చలవిడిగా వెంచర్లు వెలిశాయి. వాటిలో కొందరు అనుమతులు తీసుకోగా.. మరికొందరు గాలికి వదిలేశారు. నిబంధనలు పాటించకుండా వెంచర్లు ఏర్పాటు చేసిన వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారనే విమర్శలు వస్తున్నాయి.
మున్సిపాలిటీలో ముగ్గురు డీఈలు, నలుగురు ఏఈలు ఉన్నారు. ఒక డీఈతో పాటు ఒక ఏఈని సెలక్ట్ చేసుకొని ఆ ఇద్దరికే పట్టణంలోని యూజీడీతో పాటు సీసీ రోడ్లు అలాట్ చేసి ఇవ్వడంతో వారు ఉన్నా.. లేకున్నా పనులు మాత్రం పగలు రాత్రి సమయాల్లోనూ జరుగుతున్నాయి. దీంతో రోడ్డు పనులు నాణ్యత లేకపోవటంతో పాటు తిక్నెస్ లేదని, క్యూరింగ్ కూడా చేయడం లేదని స్థ్దానికులు ఆరోపిస్తున్నారు. కమీషన్ల వసూలు విషయంలో కూడా ఆ ఇద్దరిదే
రూ.33 వేల అద్దె చెల్లిస్తూ మున్సిపల్ సిబ్బందిని డ్రైవర్లుగా వినియోగంచడం, డీజిల్ సైతం మున్సిపల్ బిల్లుల నుంచే పోటయించటం గమనార్హం. ము న్సిపల్ కౌన్సిల్ అనుమతి లేకుండానే 27మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించి వారి నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేయటంతో పాటు కీలకమైన పనుల్లో వారినే నియమించి ఈ అక్రమ దందాకు తెర తీశారని అందులో పని చేస్తున్న ఉద్యోగులే బాహాటంగా చెప్పుతున్నారు.
అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న ముసాబ్ సయ్యద్ అహ్మద్ అర్హత లేకున్నా పదవిలోకి ఎక్కి అక్రమ దందాలు చేపట్టి మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారు. గతంలో స్వచ్ఛ మున్సిపాలిటీ పేరు మీద వచ్చిన రూ.1.50 కోట్లకు ఇప్పటి వరకు లెక్కల్లేవు. ఇంజినీరింగ్ పనుల్లో నాణ్యత లేదు. కాంట్రాక్టర్లను అడిగితే పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకరిద్దరి అధికారులను, ఔట్సోర్సింగ్ సిబ్బందిని దగ్గర పెట్టుకొని కమిషనర్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు. ఈ విషయం కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశాను.