దేవరకొండ, జనవరి 29 : బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి పట్టణ ప్రజల్లో అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు. గురువారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుండి దేవరకొండ మాజీ మున్సిపల్ ఛైర్మన్ కేతావత్ మంజ్య నాయక్, కేతావత్ రూప్ల, భవానీ శ్రీధర్ తోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి రవీంద్రకుమార్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో వరుస చేరికలు కొనసాగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నమ్మకంతో, గతంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు ఫలితంగా రాష్ట్ర ప్రజలు గులాబీ పార్టీ వైపునకు ఆకర్షితులవుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అన్నారు. బీఆర్ఎస్ తోనే దేవరకొండ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయిందన్నారు. ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, అంకిత భావంతో పని చేయాలని, బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నేతలు నేనావత్ కిషన్ రెడ్డి, కేతావత్ బిల్యా నాయక్, మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, నీల రవికుమార్, బొడ్డుపల్లి కృష్ణ, పగిడిమర్రి నాగరాజు, జమీర్ బాబా, నేనావత్ నాగార్జున, సంతోష్, జైపాల్ పాల్గొన్నారు.

Devarakonda : బీఆర్ఎస్లోకి దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ కేతావత్ మంజ్య నాయక్