దేవరకొండరూరల్, మే11: దేవరకొండ మండలంలోని పెంచికల్ పహాడ్‌లో ఉన్న గురుకుల సీఓయీకి చెందిన కేతావత్ అఖిల ఆదివారం వెలువడిన ఎప్‌సెట్ ఫలితాల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 901 ర్యాంక్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కళ్యాణి తెలిపారు.
ఆమన్‌గల్ మండలం మారుమూల మంగలికుంట తండాకు చెందిన అఖిల ప్రభుత్వ గురుకులంలో చదివి ఉత్తమ ర్యాంకు సాధించినందుకు తల్లిదండ్రులు రతన్, జ్యోతి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు, గ్రామస్తులు అభినందించారు.