– సూర్యాపేటలో ఘనంగా విజయ్ దివస్
సూర్యాపేట, డిసెంబర్ 09 : తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని, కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ చేసిన కేసీఆర్ పేరు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ ను సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి గాలిలోకి గులాబీ బెలూన్లు ఎగురవేశారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగివచ్చిన యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిందన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏళ్లు ఉద్యమం నిర్వహించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరడంతో పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారి అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. అలాగే గ్రామ గ్రామానికి మిషన్ భగీరథ మంచినీరు అందించడంతో పాటు మిషన్ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల సాగునీటి కష్టాలు తీర్చాడని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంతో పాటు సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని దేశానికి రోల్ మోడల్‌గా చేసిన కేసీఆర్ ను తెలంగాణ ప్రజానీకం ఎప్పటికీ మర్చిపోదన్నారు.
డిసెంబర్ 9ని విజయ్ దివస్‌గా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, నాయకులు ఆకుల లవకుశ, తాహిర్ పాషా, బత్తుల రమేశ్, సుంకరి రమేశ్, బండారు రాజా, సయ్యద్ సలీం, మొయినుద్దీన్, కరాటే సయ్యద్, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, అంగోతు భావ్ సింగ్, మద్దెల వీరస్వామి, సల్మా మస్తాన్, కరుణ శ్రీ, చనగాని అంజమ్మ, కల్లేపల్లి మహేశ్వరి పాల్గొన్నారు.