కట్టంగూర్, మార్చి 18 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మేజర్ గ్రామ పంచాయతీ పశువుల సంత, తైబజార్ వేలాన్ని మంగళవారం పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్రావు, ఎంపీఓ చింతమల చలపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. పశువుల సొంత వేళంలో ఐదుగురు పాల్గొనగా కట్టంగూర్ కి చెందిన చెరుకు నర్సింహ్మ రూ.31.80 లక్షలకు, అలాగే తై బజార్ వేలంలో 8 మంది పాల్గొనగా కట్టంగూర్ కు చెందిన పంతంగి రాములు రూ.1.80 లక్షలకు పాట పాడి కైవసం చేసుకున్నట్టు పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ తెలిపారు.
పశువుల సంతకు రూ.3835, తై బజారుకు రూ.3600 గతేడాది కంటే అధిక ఆదాయం లభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కొంపెల్లి యాదయ్య, రెడ్డిపల్లి మనోహర్, మునుగోటి ఉత్తరయ్య, చిత్తలూరి జానకిరాములు, యర్కల సత్తయ్య, కానుగు వెంకన్న, కాపుగంటి శీను, బాలచందర్ పాల్గొన్నారు.