కట్టంగూర్, మే 21 : కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామానికి చెందిన దివంగత మాల్ పటేల్ కట్ట లింగారెడ్డి సతీమణి, స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ కట్టా వెంకటరెడ్డి మాతృమూర్తి కట్టా విమలమ్మ (96) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈరోజు తుది శ్వాసను విడిచారు. ముత్యాలమ్మ గూడెం గ్రామాభివృద్ధికి కట్ట లింగారెడ్డి కుటుంబ సభ్యులు ఎంతగానో కృషి చేశారు. గ్రామంలోని 1500 గజాల స్థలాన్ని గ్రామ అవసరాల కోసం విరాళంగా అందించి ఉదారత చాటుకున్నారు. దివంగత విమలమ్మ అంత్యక్రియలు శుక్రవారం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు కుమారుడు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. విమలమ్మ మృతి పట్ల మాజీమంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డిలు సంతాపం తెలిపారు. అదేవిధంగా తాజా మాజీ జెడ్పిటిసి తరాల బలరాం తదితరులు విమలమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రియలకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు హాజరుకానున్నారు.