మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మెరుపు ధర్నా
నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా నేటికి ప్రారంభించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి శనివారం ఫ్లైఓవర్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మెరుపు ధర్నాకు దిగారు. ఫ్లై ఓవర్‌ను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.
నల్లగొండ, జూలై 18 : నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా నేటికి ప్రారంభించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి శనివారం ఫ్లైఓవర్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మెరుపు ధర్నాకు దిగారు. ఫ్లై ఓవర్‌ను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. ఫ్లైఓవర్ ప్రారంభించపోవడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఇప్పటికే ఒకరు మృతిచెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నాటి కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యంతో ఫ్లై ఓవర్ ఏర్పాటు చేయకపోవడంతో మర్రిగూడ బైపాస్, పానగల్ బైపాస్ ల వద్ద అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా తాను ఎమ్మెల్యేగా సమస్యను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వెంటనే స్పందించిన కేసీఆర్ రెండుచోట్ల బైపాస్ లకు నిధుల మంజూరు చేయగా పానగల్ బైపాస్ పూర్తయి ఎప్పుడో ప్రారంభించడం జరిగిందన్నారు.

మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మెరుపు ధర్నా
మర్రిగూడ బైపాస్ వద్ద ఫ్లైఓవర్ పూర్తయినా రాజకీయ కారణాలతో ప్రారంభించలేకపోయినట్లు తెలిపారు. దీంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి ప్రమాదాల నివారణకు వెంటనే ఫ్లై ఓవర్‌ను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించేంత వరకు తాము ఇక్కడి నుండి లేచేది లేదని కంచర్ల భీష్మించి కూర్చొనగా ఆయనకు మద్దతుగా స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మద్దతుకు తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నాను విరమింపజేసి వారిని తలించారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, పలువురు కార్పొరేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మెరుపు ధర్నా

మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మెరుపు ధర్నా
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

