రాజాపేట మండలంలోని 11 గొలుసుకట్టు చెరువులు, 32 కుంటలను నింపి 35,131 ఎకరాలకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తిగాక ముందే ప్యాకేజీ 15లో భాగంగా బ్రాంచ్ కెనాల్ ద్యారా మండలానికి గోదావరి జలాలు త్వరలో రానున్నాయి. కాల్వ తవ్యకం కోసం రైతుల నుంచి భూమిని సేకరించగా.. ఇప్పటికే రూ.12.46 కోట్ల పరిహారం అందజేశారు. ఇటీవలే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పనులను ప్రారంభించారు. ప్రస్తుతం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. కాల్వ పూర్తయితే త్వరలో గోదావరి జలాలతో గొలుసుకట్టు చెరువులు జల కళను సంతరించుకొని కరువు నేల తడిసి మరో కోనసీమగా మారనుంది.
ఆలేరు నియోజకవర్గానికి సాగు జలాలు అందించాలనేదే నా జీవిత ఆశయం. నిత్యం కరువుతో అల్లాడుతున్న రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సాగు జలాలు అందించి వారి కండ్లల్లో ఆనందం నింపుతాం. గంధమల్ల రిజర్వాయర్‌లోకి నీరు చేరకముందే ప్యాకేజీ 15 ద్యారా బ్రాంచ్ కెనాల్‌తో రాజాపేటకు నేరుగా సాగు జలాలు అందనున్నాయి. భూ నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం సైతం అందజేసింది. కాల్వ తవ్వకాల పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే మండలంలోని కరువు నేల తడిపి సస్యశ్యామలం చేస్తాం.
– ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి