నల్లగొండ సిటీ, మే 16 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు జరుగనుండగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పుణ్యస్నానాల కోసం వెళ్లే భక్తులు సౌకర్యార్థం ఉమ్మడి నల్లగొండ రీజియన్ పరిధిలోని 7 డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ జానిరెడ్డి శుక్రవారంఒక ప్రకటనలో తెలిపారు.
వేలాది మంది భక్తులను పుష్కరాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, రీజియన్ నుంచి సుమారు 32 బస్సులు నడుపనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులను నడిపించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.