
నల్లగొండ : సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ నూతనంగా నియమకమైన అధ్యక్షులను సన్మానించారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందర్నీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ప్రకటించారు.

మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమంలో మాజీ మండలి చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మదర్ డైరీ చైర్మన్ కృష్ణా రెడ్డి, రాష్ట్ర నాయకులు చాడ కిషన్ రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులున్నారు.