శాలిగౌరారం, డిసెంబర్ 12 : తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం, జాలోనిగూడెం, పావురాలగూడెం గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ గోదల సురేశ్‌రెడ్డి, నిమ్మల సురేశ్‌గౌడ్, చీమల శంకర్‌తోపాటు పలువురు కార్యకర్తలు శాలిగౌరారం మండల కేంద్రంలో కిశోర్‌కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పాలకులు ప్రజలను విస్మరించి పదవుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. ఆయా పార్టీల విధానాలు నచ్చక బీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.