రామన్నపేట/నార్కట్‌పల్లి ఏప్రిల్ 25 : సబ్బండ వర్గాల ప్రజలు సుభిక్షమైన కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కుంకుడుపాముల గ్రామానికి చెందిన 25 కాంగ్రెస్ కుటుంబాలు నార్కట్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే వరంగల్ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయన్నారు. కేసీఆర్ సభ అంటేనే కాంగ్రెస్ నాయకుల వెన్నులో వణుకు మొదలై అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలకు మోసపోయాయని రైతులు, మహిళలు, యువకులు బాధపడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మరోమారు కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని తెలంగాణ బిడ్డలు కంకణబద్ధులయ్యారని తెలిపారు. రైతు సమన్వయ సమితి మాజీ మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సంతోషాచారి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పులిగిల్ల పరమేశ్, నాయకులు యానాల అశోక్ రెడ్డి, గొలుసుల సత్తి, బోగ భద్రయ్య, వలిగొండ పరుశరాములు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో బొక్క శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కన్నెబోయిన సత్తయ్య, బెల్లి లింగయ్య, కన్నెబోయిన లింగయ్య, గుండెబోయిన నర్సింహ, కన్నెబోయిన సైదులు తదితరులు ఉన్నారు.