రామగిరి (నల్లగొండ ), మే 29 : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మేడి కిరణ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్ర లైబ్రరీలో ఉద్యోగార్థులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ నెల 30న హైదరాబాద్లో నిర్వహించే నిరుద్యోగ జేఏసీ కార్యక్రమానికి మద్దతుగా శుక్రవారం నల్లగొండ సెంట్రల్ లైబ్రరీ నుండి బయల్దేరనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ జిల్లా నాయకులు నదీర్, సాయినాథ్ పాల్గొన్నారు.