నీలగిరి, మే 26 : పిల్లలు లేని దంపతుల కోసం ఓయాసిస్ ఫర్టిలిటీ ఆధ్వర్యంలో అధునాతన సంతాన సౌకర్య పరిష్కారాలతో ఏర్పాటు చేసిన జననీ యాత్రను సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో జననీ యాత్ర కార్యక్రమాన్ని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జననీ యాత్రలో పిల్లలు కాని దంపతుల కోసం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించి వారికి సంతానం అందిస్తారని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 13 పట్టణాల్లో 400 జంటలకు ఉచితంగా స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్ సాయి మాసన దార్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఖయ్యుంబేగ్ సిబ్బంది పాల్గొన్నారు.