చందంపేట, అక్టోబర్ 5 : ఉన్న ఊరు వదిలి ఇతర గ్రామానికి వచ్చి వలస పడ్డ వారికి ఆర్థిక సాయం అందిస్తే రుణపడి ఉంటారని చిత్రియాల పిఎసిఎస్ చైర్మన్ జాల నరసింహారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కొండ మల్లేపల్లి మండలం గుమ్మడివెల్లి గ్రామానికి చెందిన షేక్ నజీర్ కుటుంబం చందంపేట మండలం చిత్రియాల గ్రామంలో బతుకుతెరువు కోసం వలస రావడంతో గుర్తించిన నరసింహారెడ్డి ఆదివారం పదివేల రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందించారు.
అదేవిధంగా ముగ్గు పిల్లలకు నూతన పట్టు బట్టలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న ఊరిని వదిలి వలస చిన్న కార్మికునికి ఆర్థిక సాయం అందిస్తే ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదయ్య, వెంకటయ్య, అంకలు, నిరంజన్, చారి, యాదయ్య ఉన్నారు.