తుంగతుర్తి, ఏప్రిల్ 05 : దళిత, బహుజనుల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం దేశ మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 118వ జయంతిని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, భారత ఉప ప్రధానిగా దళిత బహుజనుల అభ్యున్నతికి పాటుపడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్ పాల్వాయి గురువయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, గోపగాని రమేశ్, కొండగడుపుల వెంకటేశ్, బొంకూరి మల్లేశ్, బొజ్జ సాయి కిరణ్, గోపగాని వెంకన్న పాల్గొన్నారు.