కోదాడ, జూలై 06 : దళిత బహునుల ఆశాజ్యోతి జగ్జీవన్ రాం అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, కౌన్సిలర్ చీమ నరేష్ అన్నారు. సోమవారం కోదాడలో జగ్జీవన్ రాం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటంలో జగ్జీవన్ రాం సముచిత పాత్ర పోషించారని కొనియాడారు. పార్లమెంట్ సభ్యుడిగా దేశ భవిష్యత్ కోసం తన గళాన్ని వినిపించారన్నారు. దళిత బహుజనుల ఉద్ధరణ కోసం కృషి చేశారని, ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్ల సుందర్ బాబు, అబూబకర్, కరీముల్లా, బాబా, పిట్టల భాగ్యమ్మ, ఉపేందర్ గౌడ్, గొర్రె రాజేష్, జానీ, గోపాలరావు, వెంకటరావు, పుల్లారావు పాల్గొన్నారు.