శాలిగౌరారం, అక్టోబర్ 24 : ప్రముఖ వైద్యుడు, పవన్ సాయి హాస్పిటల్ అధినేత, నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామానికి చెందిన డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి లింగమ్మ ఇటీవల మరణించారు. విషయం తెలిసిన సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ శుక్రవారం తుడిమిడి గ్రామానికి చేరుకున్నారు. లింగమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌ను పరామర్శించారు. వారి వెంట నాయకులు గుండ శ్రీనివాస్, కట్ట వెంకట రెడ్డి, మామిడి సర్వయ్య, గుజరాల్ శేఖర్ బాబు, రాచకొండ గణేష్, మల్లేష్, తీగల వెంకన్న, మాగి రవి పాల్గొన్నారు.