నల్లగొండ, జులై 18: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శనివారం ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నల్లగొండలోని పార్టీ ఆఫీసులో జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో పాటు మా జీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు.
పీఏపల్లి, గుడిపల్లి మండల బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. మునుగోడు, శాలిగౌరారం, పెద్దవూర, గుర్రంపోడు, చండూ రు, కొండమల్లేపల్లి, హాలియా, తిర్మలగిరి సాగర్ మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. సూర్యాపేట లోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జగదీశ్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకేటేశ్వర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కొత్త బ స్టాండ్ వద్ద సత్యనారాయణ అన్నదానం చేశారు. కేసారం చర్చిలో దుర్గా ప్రభాకర్ ప్రార్థలు చేశారు.
పిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. వాణిజ్య బవన్ సెంటర్లో మహేశ్వరి-దశరథ దంపతులు అల్పాహారం పంపిణీ చేశారు. దండు మైసమ్మ గుడి వద్ద జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ పూజలు నిర్వహించారు. ప్రభాకర్‌రెడ్డి కేక్ కట్ చేసి పూజల చేశారు. తిర్మలగిరిలో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయగా జాన్‌పహాడ్‌లో బీఆర్ఎస్ శ్రేణులు పూజలు నిర్వహించారు. ఎండ్లపల్లి గ్రామంలో సూర్యాపేట మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం ఆ ధ్వర్యంలో సీతారామ చంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
హుజుర్నగర్లో రక్తదానం చేశారు. యాదాద్రి బోవనగిరి జిల్లాలోని మోత్కూర్, చౌటుప్పల్ మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి జగదీశ్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాలె శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, దొడ్డి రమేశ్, సింగం రామ్మోహన్, లక్ష్మి, యాట జయప్రద, పద్మ, కొండూరు సత్యనారాయణ, వెంకన్న, జమాల్ ఖాద్రీ పాల్గొన్నారు.