అర్వపల్లి/నాగారం, జూన్ 15 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సర్ ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్కు చెందిన బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం అర్వపల్లిలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్ ప్రక్రియ, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమో దు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బూత్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇస్తామని, బూత్ ఏజెంట్లు సరిగా పని చేయకుంటే పార్టీకి ద్రోహం చేసిన వారవుతారని జగదీశ్‌రెడ్డి అన్నారు.
ఇప్పటికే జనం అధికార కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటున్నారని, అలాగే ఓట్లు మాయం చేసే పార్టీల పట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరి ఓటును కాపాడాలని, ఓ యజ్ఞంలా పని చేయాలన్నారు. మళ్లీ తుంగతుర్తిలో గులాబీ జెం డా ఎగరడం ఖాయమని అన్నారు. తుంగతుర్తిలో 64 శాతం ఓటర్లు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. గోదావరి నీళ్లతో తుంగతుర్తిని సస్యశ్యామలం చేశామని పసిడి పంటలు పండించామన్నారు. మూడు యాసంగి సీజన్లలోనూ తుంగతుర్తి నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేదన్నారు. వడ్లు ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయని, వడ్లు తడుస్తున్నా మిల్లర్లు కొనడం లేదన్నారు. యూరియా కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం చతికిల పడిందని, యూరియాతో పాటు డీఏపీకి కూడా యాప్ పెడుతున్నారని తెలిసిందన్నారు.
ఇద్దరు మంత్రులతో జిల్లా అధోగతి..
జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు హెలికాప్టర్ మం త్రులుగా పేరు పొందారని, ఆ ఇద్దరి వల్ల జిల్లా అధోగతి పాలవుతుందన్నారు. ఉత్తమ్‌కు అవగాహన సున్నా అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం నీళ్లు వచ్చిన తరువాతనే ధాన్యం రికార్డు స్థాయిలో దిగుబడి అయిందని గుర్తు చేశారు. కానీ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు రాలేదంటారు… మరో పక్క ధాన్యం రికా ర్డు స్థాయిలో పండుతోందంటున్నారు. మరి నీళ్లు ఎక్కడివో చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని, హాస్యాన్ని పం డిస్తోందన్నారు. వాటర్‌లో.. నీళ్లు అనే మరో మంత్రి సొంత జిల్లాలోనే రోడ్లు దరిద్రంగా తయారయ్యాయన్నారు.
హ్యాం రోడ్లు అంటూ నానా హంగామా చేస్తుండన్నారు. ఇక గ్రామీణ రోడ్లపై కూడా టోల్ ప్లాజాలు పెట్టేలా కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. యాదాద్రి పవర్ ప్లాంట్ రద్దు చేస్తాం.. కూలగొడతామంటూ ప్రగల్బాలు పలికారని, మళ్లీ ఇప్పు డు ప్రైవేటేజైషన్ పేరుతో హంగామా చేస్తున్నారని అన్నారు. సమావేశంలో సభ్యత్వాల జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కిశోర్‌కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వర్లు, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రామకృష్ణారెడ్డితో పాటు బూత్ ఇన్చార్జిలు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంటింటి గణనను సీరియస్‌గా తీసుకోవాలి
అర్వపల్లి, జూన్ 15 : ఎస్ఐఆర్ (సర్)పై అప్రమత్తంగా ఉండాలని, ఇంటింటి గణనను సీరియస్‌గా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. అర్వపల్లిలో బూత్ లెవెల్ ఏజెంట్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి పక్ష పార్టీల ఓట్లు తొలిగిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు అప్రమతంగా ఉండాలని పిలుపునిచ్చారు. జూన్ 25 నుంచి 24 వరకు జరిగే ఇంటింటి గణనను సీరియస్‌గా తీసుకోవాలని, జులై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, పొరపాట్లు ఉంటే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ సవరించుకోవాలన్నారు. కేసీఆర్ సీఎం కావాలంటే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త బీఎల్వో, ఐఆర్‌పై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.

సీఎం మోసాలను జనంలోకి తీసుకెళ్లాలి
అర్వపల్లి, జూన్ 15: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోసాలను జనంలోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. సోమవారం అర్వపల్లిలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దివాలా తీయించాడన్నారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో చేసేందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, ఎస్సారెస్పీ నీటితో బీడు భూములను, పచ్చని పంట పొలాలుగా మార్చామన్నారు.
గ్రామాల్లో ఇప్పటికీ తాను చేసిన అభివృద్ధే తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పని కూడా చేపట్టలేదన్నారు. సర్ ప్రక్రియను ఆషామాషీగా తీసుకోవద్దని, బూత్ ఏజెంట్లు అప్రమతంగా ఉంటూ ఏ ఒక్క ఓటు గల్లంతు కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బుడగుల లింగయ్య యాదవ్, గుజ్జ దీపిక, వెంకటేశ్వర్లు, రామకృష్ణారెడ్డి, ధర్మేందర్‌రెడ్డి, సంకేపల్లి రఘునందన్‌రెడ్డి, గుండగాని సోమేశ్గౌడ్, దావుల వీరప్రసాద్ యాదవ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, మన్నె రేణుక, మొరిశెట్టి ఉపేందర్, మండలాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.