నల్లగొండ, ఆగస్టు 12 : ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం అము చేస్తున్న పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బకి వెంకటయ్య అన్నారు. బుధవారం ఆయన కమిషన్ సభ్యులతో కలిసి నల్లగొండ కలెక్టరేట్లో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల భూముల సమస్యలు, దాడుల కేసులు, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సబ్‌ప్లాన్ నిధులు మిగిలిపోతే తిరిగి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, ఇతర పనులు చేపట్టాలన్నారు. ఉద్యోగాలు, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు తప్పనిసరిగా ఆర్వోఆర్ అమలు చేయాలన్నారు. ఎంపీ, నియోజకవర్గం అభివృద్ధి, ఎస్డీఎఫ్ నిధులను రిజర్వేషన్ ప్రకారం కేటాంచాలన్నారు. మిర్యాలగూడ డివిజన్లో శూన్యపహాడ్, గణేశ్ పహాడ్ రోడ్డు వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా పరిషరించాలని కలెక్టర్‌ను కోరారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి కోర్టు కేసులు జాప్యం లేకుండా పరిషరించాలన్నారు.
పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ అమలు చేయాలన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై విచారణ చేసి కమిషన్‌కు నివేదిక పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. చండూరు మండలం అంగడిపేటకు చెందిన ఎస్సీ మహిళ మేకల బుచ్చమ్మ ఇంటి వివాదం కేసును పరిషరించాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో బాధితులకు అందించాల్సిన రూ.1.89 కోట్ల పరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా తెప్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆదివారం సీఎంతో నిర్వహించనున్న హైపవర్ కమిటీలో వీటన్నిటిపై సమీక్షించి నిధులు మంజూరు చేయాలని కోరతామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తున్న అడ్వకేట్ దర్శన్‌కు గన్‌మెన్‌ను పునరుద్ధరించాలని ఎస్పీని కోరారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పాటించాలని తెలిపారు. కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, సభ్యులు రాంబాబు నాయక్, సుంకు ధనలక్ష్మి, బెజ్జం సైదులు, అనిత, భీమనపల్లి సైదులు, భాసర్, కే.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమకరణ్‌రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శశికళ, డీటీడీవో కమలాకర్, డీఎఫ్‌వో రాజశేఖర్, డీఆర్వో దశరథ్ పాల్గొన్నారు.