యాదగిరిగుట్ట, జూన్ 18: మరో రెండేండ్లలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని, అప్పడు చట్ట విరుద్ధంగా పనిచేసిన అధికారులు, పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. భూ కబ్జాలు, మట్టి, ఇసుక మాఫియాకు పోలీసు అధికారు లు తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెడుతూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న ఎస్సై, సీఐ, డీఎస్పీలు ఏ హో దాలో ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా రప్పించి అదే పోలీస్ స్టేషనలో దోషులుగా నిలబెట్టే వరకు ఊరుకునేది లేదన్నారు.
తప్పుడు కేసులు కొట్టివేయిస్తామని, పార్టీ కార్యకర్తలు ఆధైర్యపడొద్దని అన్నారు. గురువారం మండలంలోని వంగపల్లి ఫంక్షన్హాల్లో ఎస్ఐఆర్పై (సర్)పై బూత్ ఏజెంట్ల అవగాహన సదస్సు లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ మ్యా పింగ్ జరిగే పరిస్థితులు, వాటిని ఎలా ఎదుర్కోవాలి.. ఓట్లు తొలగిస్తే తీసుకోవాల్సిన జాగ్రతలు, తిరిగి ఎలా పొందాలనే అంశాలను స్పష్టంగా వివరించారు. సుమారు 1500 మం ది బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లకు మాజీ మంత్రి విడమరిచి చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నారు. ఎస్ఐఆర్ ముఖ్యమా.. సభ్యత్వం ముఖ్యమా అంటే ముమ్మాటికీ ఎస్ఐఆర్ ముఖ్యమని, ఆ తర్వాతే సభ్యత్వమని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశా రు.
90 లక్షల ఓట్లను తొలగించి బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. 30 లక్షల ఓట్లను తొలగించారంటూ మమతా బెనర్జీ ఆధారాలు చూపినా ఫలితం లేకుండా పోయిందన్నారు. బెంగాల్లో ఆమెను ఓడించింది ఆ 30 లక్షల ఓట్లేనన్నారు. 2002లో ఎస్ఐఆర్లో ఓట్ల నమోదును చూపి మ్యాపిం గ్ చేసి ఓట్లు తొలగిస్తున్నారన్నారు. ఈ నెల 25 నుంచి ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. బీఎల్ఏలు వాచ్ డాగ్‌లా పనిచేయాలని సూచించారు. ప్రతి బీఎల్ఏ వద్ద బూత్‌కు సంబంధించిన ఓటరు లిస్టు ఉండాలన్నారు. జూలై 31న ముసాయిదా ఓటరు లిస్టు వస్తుందని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. బీఆర్ఎస్కు పడే ఓట్లను కాపాడుకునే బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లంతా కేసీఆర్ ఏజెంట్లేనని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ శ్రేణులపై కేసులా..
కేసీఆర్ అంటే అధికారులు, మంత్రులు, పోలీసులకు భయం ఉండేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ సార్ హయాంలో శాంతి భద్రతలను పరిరక్షించామన్నారు. అందుకే జనానికి కేసీఆర్ గుర్తుకు వస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మట్టి మాఫియా, ఇసుకు మాఫియా, భూ కబ్జాల మయంగా మారిందన్నారు. ఏ గ్రామంలోకి వెళ్లినా సహజ సంపదలైన చెరువు మట్టి, ఇసుకను తోడేస్తున్నారన్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. దొరికిన కాడికి దోచుకునే పనిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పడ్డారని విమర్శించారు.
ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రెచ్చిపోతున్నాడన్నారు. ఇటీవల ఆలే రు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఓ కాంగ్రెస్ నాయకుడు పోలీసులనే బెదిరిస్తున్న వీడియో వైరల్ గా మారిందన్నారు. పోలీసు అధికారిపై నానా దుర్భాషలాడిన ఆ పార్టీ నాయకుడికి వదిలి, వీడియోను బహిర్గతం చేసిన నాయకుడిపై కేసులు పెట్టేందుకు పోలీసులు చూస్తున్నారన్నారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే స్టేషన్‌కు వచ్చి విధులకు ఆటంకం కలిగించిన ఆ నా యకుడిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మారినట్టు కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు.
తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష
తెలంగాణ రాష్ర్టాన్ని పాలించేది హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని, చంద్రబాబు, మోదీ కలయికతో పుట్టిన వ్యక్తి ఈ రాష్ర్టానికి సీఎం అయ్యారని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. హైబ్రిడ్ సీఎంకు ఎన్నికల రాగానే రైతు భరోసా గుర్తుకు వస్తుందన్నారు.మున్సిపల్ ఎన్నికల సమయం లో ఎకరం భూమి ఉన్న రైతులకు రైతు భరో సా వేశారన్నారు. మిగతా రైతులకు ఎగనా మం పెట్టారన్నారు. మరో నాలుగు నెలల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే యోచనతో యాసంగి సీజన్లో ఇచ్చే రైతు భరోసాను ఇవ్వకుండా, వర్షాకాలంలో రైతు భరోసా వేస్తామని దొంగ హామీలు ఇస్తున్నారన్నారు. యూ రియా అందక, వడ్లు కొనుగోలు చేయక రైతు లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ర్టానికి కేసీయార్ శ్రీరామరక్ష అని జనం నమ్ముతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కారు గుర్తుకు ఓటేసేందు కు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
దుర్మర్గుడి చేతిలో తెలంగాణ
రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోందని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ఒక దుర్మార్గుడి చేతిలో రాష్ట్రం ఉందన్నారు. హైడ్రా పేరుతో నిరుపేదల ఇండ్లు కూల్చే పనిలో ఆ దుర్మార్గుడు ఉన్నాడన్నారు. పాలన అంటే ఎలా ఉంటుందో చూపిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. భూముల సమ స్య అని ఏ మంత్రి చాంబర్‌కు వెళ్లినా 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. బిల్లులు మంజూరు కావాలంటే సర్పంచులు మంత్రులకు 10 శాతం కమీషన్ చెల్లించాల్సిందేనన్నారు. చాలా మం ది సర్పంచ్‌లు కాంగ్రెస్ పాలనపై విసుగు చెందారన్నారు. మరో రెండేళ్లు ఉండే కాం గ్రెస్ పార్టీలో చేరేదిలేదని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల సర్పంచులు ధీమాగా ఉన్నారని గుర్తు చేశారు.
శిలాఫలకాలు కూలుస్తున్నారు.. గొంగిడి సునీత
సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పేరుతో హైదరాబాద్‌ను కూలుస్తుంటే, ఆలేరు ఎమ్మెల్యే ఇక్కడ గతంలో మంజూరైన హైవే బ్రిడ్జి, బీటీ రోడ్డు, అండర్ పాస్‌లు, స్లాబ్ కల్వర్టుల శిలాఫలకాలు కూల్చివేస్తున్నారని ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్జి గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సహజ సంపదను దండుకునే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డారన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే వ్యవహారం నియంతలా ఉందన్నారు. చివరికి లక్ష్మీనరసింహస్వామి ఆదాయాన్ని సైతం వదలడం లేదన్నారు.

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: బడుగుల
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతికార్యకర్త బాధ్యతాయుతంగా పని చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లిం గయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి వి భాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, నార్ముల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, వివిధ మండలాల బీఆర్ఎస్ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, బీసు చందర్‌గౌడ్, పొలగాని వెంకటేశ్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, ఎండీ ఖలీల్, సట్టు తిరుమలేశ్, ఆలేరు పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశ్, యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు పాపట్ల నరహరి, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధా బీరయ్య, యువజన విభాగం నాయకులు భీమగాని నర్సింహాగౌడ్, బీసు కృష్ణంరాజు, విద్యార్థి విభా గం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకర్, వివిధ మండలాల మహిళా విభాగం అధ్యక్షురాళ్లు బొలగాని నాగమణి, సోలిపురం అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరు గడ్డ బీఆర్ఎస్ అడ్డాగొంగిడి మహేందర్‌రెడ్డి
2001లో పార్టీ ఆవిర్భవించిన రెండు నెలలకే 6 ఎంపీపీలు, 6 జడ్పీటీసీలను గెలిపించిన గడ్డ ఆలేరు నియోజకవర్గమ ని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆలేరు గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని అన్నారు.
ఆలేరు బీఆర్ఎస్ కంచుకోట బండా నరేందర్‌రెడ్డి
ఎస్ఐఆర్ పై బీఆర్ఎస్ బూత్ లెవ ల్ ఏజెంట్ల అప్రమత్తంగా ఉండాల ని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్, ఆ లేరు నియోజకవ ర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జి బండా నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్కు పడే ఓట్లను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడబోదని అన్నారు. అందుకే అధికార పార్టీ కాంగ్రెస్ ఎస్ఐఆర్ను పట్టించుకోవడం లేదన్నారు.
భూమి శిస్తును సహించం కంచర్ల రామకృష్ణారెడ్డి
రైతులకు ఏటా రెం డు పంటలకు అం దజేసే రైతు భరోసాకు ఎగనామం పెట్టి, భూమి శిస్తు ను అమలు చేసే ప నిలో సీఎం ఉన్నాడని, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనను సహించేది లేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నా రు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మకై బీఆర్ఎస్ ఓట్లను తొలగించే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.
మళ్లీ కేసీఆర్ రావాలి బిక్షమయ్యగౌడ్
ఎక్కడ చూసినా ప్రజలంతా మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నార ని మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక ఓట్లు తొలగించే పనిలో కాంగ్రెస్, బీజేపీలు పడ్డాయని ఆరోపించారు.
60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ బీఆర్ఎస్: క్యామ మల్లేశ్
రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల సభ్య త్వం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని పా ర్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యా మ మల్లేశ్ అన్నారు. బెంగాల్, బీహార్‌లో జరిగినట్టు ఇక్కడ జరగనివ్వబోమని అన్నారు.