సూర్యాపేట, ఆగస్టు 26 : వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఐక్యత, భక్తి శ్రద్ధలతో నవరాత్రి వేడుకలు జరుపుకోవాలంటూ మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఎలాంటి విఘ్నాలు లేకుండా తెలంగాణ సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఏకదంతుడి దీవెనలతో ప్రజలంతా శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని జగదీశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.