నీలగిరి, సెప్టెంబర్ 24: ఓ యువకుడు యూరియాపై ప్రశ్నిస్తే విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ వాడపల్లి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డిపై పలు దిన పత్రికల్లో బుధవారం నిరాధార కథనాలు వెలువడ్డాయని, ఆ కథనాలు పూర్తిగా అవాస్తవమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ ప్రకటనలో ఖండించారు. ఈనెల 2వ తేదీ సాయం త్రం దామరచర్ల మండలం కొత్త పేట తండాకు చెందిన సాయి సిద్ధు, సుమన్ తమ స్నేహితులతో కలిసి ఊరిబయట మద్యం సేవిస్తున్నారన్నారు.
ఈ క్రమం లో సాయి సిద్ధు అన్న నవీన్, మరో వ్యక్తితో అకడకు రావడంతో చిన్న విషయమై వారి మధ్య ఘర్షణ జరిగిందన్నా రు. ఈ ఘర్షణలో సుమన్ దాడి చేయడంతో నవీన్‌కు తలకు చిన్న గాయమైందన్నారు. ఇది మనసులో పెట్టుకొని అన్నదమ్ములైన సాయి సిద్ధు, నవీన్ కలిసి అదే రోజు రాత్రి సుమన్ ఇంటి వద్దకు వెళ్లారన్నారు. అ యితే ఆ సమయంలో సుమన్ ఇంటి వద్ద లేకపోవడంతో సుమన్ తల్లిదండ్రులపై దాడి చేసి కొట్టారన్నారు.
దాడిలో సుమన్ తల్లి ముకు ఫ్యాక్చర్ కాగా, తండ్రి పకటెముకలకు గాయాలైనట్లు తెలిపారు. ఈ విషయం లో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి, ఈనెల 9న సాయిసిద్ధు, నవీన్‌ను రిమాండుకు తరలించినట్లు తెలిపారు. కాగా ఈనెల 3వ తేదీన సాయి సిద్ధూ చింతపల్లి క్రాస్‌రోడ్డు వద్ద యూరియా కోసం రైతులతో పాటు ధర్నా చేశాడని, అది మనసులో పెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచక్షణరహితంగా కొట్టారనడం అవాస్తవమన్నారు.
ఘర్షణ సం దర్భంగా నమోదైన కేసు విషయంలో వైద్య పరీక్షలు (మెడికల్ ఫిట్నెస్) చే యించి, పూర్తి ఆధారాలతో రిమాండుకు తరలించినట్లు తెలిపారు. పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగేలా అవాస్తవాలు, ఎలాంటి ఆధారాల్లేని అసత్య కథనాలు ప్రచురించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నేర నియంత్రణకు జిల్లా పోలీసు శాఖ అహర్నిశలు శ్రమిస్తోందని, వాస్తవ విషయాలను ప్రచురించాలని ఆయన ప్రకటనలో కోరారు.